విద్యుత్ తీగలు తగిలి.. మృత్యువాత పడ్డ గజరాజులు

వెస్ట్ బెంగాల్‌లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి మూడు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన రాష్ట్రంలోని జార్‌గ్రామ్ జిల్లాలో జరిగింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఈ గజరాజుల మృతికి కారణమని స్థానికులు ఆరోపించారు. బిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాట్‌బాకీ ప్రాంతం గుండా ఏనుగుల గుంపు వెళ్తోంది. అయితే ప్రమాదవశాత్తు మూడు ఏనుగులకు హైటెన్షన్ వైర్ తాకింది. దీంతో అవి అక్కడికక్కడే చనిపోయాయి. అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న […]

విద్యుత్ తీగలు తగిలి.. మృత్యువాత పడ్డ గజరాజులు
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2019 | 1:16 AM

వెస్ట్ బెంగాల్‌లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి మూడు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన రాష్ట్రంలోని జార్‌గ్రామ్ జిల్లాలో జరిగింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఈ గజరాజుల మృతికి కారణమని స్థానికులు ఆరోపించారు.

బిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాట్‌బాకీ ప్రాంతం గుండా ఏనుగుల గుంపు వెళ్తోంది. అయితే ప్రమాదవశాత్తు మూడు ఏనుగులకు హైటెన్షన్ వైర్ తాకింది. దీంతో అవి అక్కడికక్కడే చనిపోయాయి. అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు విచారణకు ఆదేశించారు.