తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రమోషన్లు

తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు చాలా మంది ప్రమోషన్లు అందుకున్నారు. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో 49 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. మొత్తం 49 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ 15 జీవోలు జారీ చేసింది. అందులో 26 ఐఏఎస్ లకు పదోన్నతులు లభించాయి. ముగ్గురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా […]

తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రమోషన్లు
Follow us

|

Updated on: Apr 23, 2019 | 4:21 PM

తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు చాలా మంది ప్రమోషన్లు అందుకున్నారు. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో 49 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. మొత్తం 49 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ 15 జీవోలు జారీ చేసింది. అందులో 26 ఐఏఎస్ లకు పదోన్నతులు లభించాయి. ముగ్గురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ప్రమోషన్ పొందనున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. ఒకరికి ముఖ్య కార్యదర్శి, నలుగురికి కార్యదర్శి, ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు లభించాయి. ఐదుగురు ఐఏఎస్లకు సంయుక్త కార్యదర్శి, మరో నలుగురికి డెప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 23 మంది ఐపీఎస్‌లకు కూడా ప్రమోషన్లు లభించాయి. ఐదుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి లభించింది. నలుగురు ఐపీఎస్‌లకు ఐజీ, ఏడుగురు ఐపీఎస్ లకు డీఐజీలుగా, ఆరుగురు ఐపీఎస్ లకు సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.