టీచర్‌పై పోలీసుల గ్యాంగ్ రేప్.. ఆపై చేతిలో రూ.600 పెట్టి.. ఆ తర్వాత..!

రక్షించాల్సిన రక్షకభటులే.. కామాంధులుగా మారారు. కంచే చేను మేసిందన్న సామెతను నిజం చేశారు పోలీసులు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను కాపాడాల్సింది పోయి.. వాళ్లే ఆమెపై బలాత్కారం చేస్తే.. బాదితురాలు ఏం చేయాలి. యూపీలో జరిగిన ఓ సంఘటన.. పోలీసు వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చారు. ఓ ఉపాధ్యాయురాలిపై పోలీసులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇక వివరాల్లోకి వెళితే.. గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్‌‌ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 24 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువతి.. […]

టీచర్‌పై పోలీసుల గ్యాంగ్ రేప్.. ఆపై చేతిలో రూ.600 పెట్టి.. ఆ తర్వాత..!
Follow us

| Edited By:

Updated on: Feb 16, 2020 | 4:11 AM

రక్షించాల్సిన రక్షకభటులే.. కామాంధులుగా మారారు. కంచే చేను మేసిందన్న సామెతను నిజం చేశారు పోలీసులు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను కాపాడాల్సింది పోయి.. వాళ్లే ఆమెపై బలాత్కారం చేస్తే.. బాదితురాలు ఏం చేయాలి. యూపీలో జరిగిన ఓ సంఘటన.. పోలీసు వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చారు. ఓ ఉపాధ్యాయురాలిపై పోలీసులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇక వివరాల్లోకి వెళితే.. గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్‌‌ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఓ 24 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువతి.. స్థానికంగా ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తోంది. అయితే తన అక్క ఇంటికి తల్లితో వెళ్లిన ఆమె.. రిటర్న్ నడుచుకుంటూ వెళ్తోంది. తన తల్లి కాస్త వెనకాల బల్డేరి వస్తోంది. అయితే అటుగా వెళ్తున్న ఓ ఇద్దరు పోలీసులు సదరు యువతిపై కన్నేశారు. వెంటనే ఒంటరిగా ఉన్న ఆమెను అడ్డకుని..ఆమె పట్ల అసభ్య రీతిలో ప్రవర్తించారు. నువ్వు వేశ్యవు కదా.. అంటూ ప్రశ్నిస్తూ.. ఆమెపై మానసికంగా దాడికి దిగారు. అయితే తాను టీచర్‌నని చెప్పినా.. తన వెనకాల తన తల్లి వస్తుందని చెప్పినా.. ఈ కామాంధులు వినిపించుకోలేదు.

బలవంతంగా వారి వద్ద ఉన్న బైక్‌పై ఎక్కించుకుని.. సమీపంలో ఉన్న ఓ రైల్వేస్టేషన్ దగ్గర్లోని గదికి లాక్కెళ్లారు. అనంతరం సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెపై భౌతికంగా దాడులకు దిగి.. తీవ్రంగా గాయపర్చారు. అనంతరం కాసేపయ్యాక.. ఆ బాధితురాలి చేతిలో.. ఓ రూ.600/- పెట్టి వెళ్లిపొమ్మన్నారు. దీంతో ఇంటికి చేరుకున్న ఆమె.. జరిగిన ఘటనను తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.