రెండో రోజు కొనసాగుతున్న తానా మహాసభలు.. ఇవీ ప్రత్యేకతలు!

వాషింగ్టన్ డీసీ: అమెరికాలో తెలుగువారు జరుపుకునే తానా 22వ వార్షికోత్సవ సభలు నిన్న అనగా జూలై 4న అట్టహాసనంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం వాషింగ్టన్ డీసీలో నభూతో నభవిష్యత్ అనేలా ఏర్పాటు చేశారు. ఇందులో ఫండ్ రైజింగ్ ఈవెంట్లు, ధీంతానాల సందడి, స్పోర్ట్స్ కాంపిటేషన్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ఈవెంట్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి పలు రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు. పవన్ కల్యాణ్, సింగర్ సునీత, సంగీత […]

రెండో రోజు కొనసాగుతున్న తానా మహాసభలు.. ఇవీ ప్రత్యేకతలు!
Follow us

|

Updated on: Jul 06, 2019 | 12:09 AM

వాషింగ్టన్ డీసీ: అమెరికాలో తెలుగువారు జరుపుకునే తానా 22వ వార్షికోత్సవ సభలు నిన్న అనగా జూలై 4న అట్టహాసనంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం వాషింగ్టన్ డీసీలో నభూతో నభవిష్యత్ అనేలా ఏర్పాటు చేశారు. ఇందులో ఫండ్ రైజింగ్ ఈవెంట్లు, ధీంతానాల సందడి, స్పోర్ట్స్ కాంపిటేషన్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ఈవెంట్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి పలు రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు. పవన్ కల్యాణ్, సింగర్ సునీత, సంగీత దర్శకుడు థమన్, రాజకీయ నాయకులు పయ్యావుల కేశవ్, విష్ణు, యాంకర్ సుమ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా రెండో రోజు తానా మహాసభల్లో ప్రత్యేకతలు ఏంటంటే…

  • ‘తానా పరేడ్‌’ నిర్వహణ. ‘ఎ మ్యుజికల్‌ జర్నీ విత్‌ ఎం.ఎం.కీరవాణి’, ‘గాయని సునీతతో లైవ్‌’.
  • జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ పలు కార్యక్రమాల్లో కీలకోపన్యాసాలు చేయనున్నారు.
  • ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ లీడర్‌షిప్‌’ అనే అంశంపై భారత్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ప్రసంగం.
  • స్వామి పరిపూర్ణానంద, యేర్పేడు స్వామీజీ తదితరుల ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు మేడసాని మోహన్‌ అష్టావధానం.

ఇంకా మూడో రోజున ‘శ్రీనివాస కల్యాణం’తో తానా మహాసభలు పూర్తవుతాయి.