ఫ్లోరిడాలో భారీ పేలుడు.. 21 మందికి తీవ్ర గాయాలు

Florida blast, ఫ్లోరిడాలో భారీ పేలుడు.. 21 మందికి తీవ్ర గాయాలు

అమెరికా ఫ్లోరిడాలోని ప్లాంటేషన్ నగరంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఓ మాల్‌లోని రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి రెస్టారెంట్‌ పక్కనే ఉన్న భవనం ధ్వసంమైంది. షాపింగ్ కోసం వచ్చిన 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ పేలుడుకు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. గ్యాస్ పైపు లీకేజీ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల కార్యాలయాలు, వాహనాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *