అసోంను ముంచెత్తుతున్న వరదలు.. 208 వన్యప్రాణులు మృతి

Monsoon 2019, అసోంను ముంచెత్తుతున్న వరదలు.. 208 వన్యప్రాణులు మృతి

అసోంలో వరదలు ప్రమాద స్థాయికి చేరాయి. మూడు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. తాజాగా అసోంలోని ప్రముఖ కాజిరంగా నేషనల్ పార్కు మొత్తం నీట మునిగిపోయింది. దీంతో పార్కులోని 208 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. వీటిలో 18 ఖడ్గమృగాలు, 167 జింకలు, ఓ ఏనుగు ఉన్నాయి. పార్కులోకి వదరనీరు పోటెత్తడంతో మరికొన్ని జంతువులు ప్రాణాల్ని దక్కించుకునేందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి. వదర ఉధృతికి జంతువుల సంరక్షణ కష్టమవుతోందని జూ అధికారులు తెలిపారు. కొన్నింటిని ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా అస్సాంలో వందలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకూ 70 మంది ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *