క్రిమినల్ ఎంపీలు పెరిగారు..వీళ్ళే మన’ ప్రజాప్రతినిధులు ‘!

లోక్ సభ ఎన్నికల సంరంభం ముగిసింది. ఇక మన కొత్త ప్రజాప్రతినిధుల్లో చాలామంది యవ్వారాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎ డి ఆర్) బయట పెట్టింది. ఈ కొత్త ఎంపీల్లో 43 శాతం మంది (233 మంది) మీద క్రిమినల్ అభియోగాలున్నట్టు తేలింది. ఇది 2014 తో పోలిస్తే 26 శాతం ఎక్కువని ఈ సంస్థ విశ్లేషించింది. బీజేపీ విషయానికి వస్తే 39 శాతం మంది (116 మంది) కి క్రిమినల్ హిస్టరీ ఉంది. కాంగ్రెస్ […]

క్రిమినల్ ఎంపీలు పెరిగారు..వీళ్ళే మన' ప్రజాప్రతినిధులు '!
Follow us

|

Updated on: May 28, 2019 | 1:43 PM

లోక్ సభ ఎన్నికల సంరంభం ముగిసింది. ఇక మన కొత్త ప్రజాప్రతినిధుల్లో చాలామంది యవ్వారాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎ డి ఆర్) బయట పెట్టింది. ఈ కొత్త ఎంపీల్లో 43 శాతం మంది (233 మంది) మీద క్రిమినల్ అభియోగాలున్నట్టు తేలింది. ఇది 2014 తో పోలిస్తే 26 శాతం ఎక్కువని ఈ సంస్థ విశ్లేషించింది. బీజేపీ విషయానికి వస్తే 39 శాతం మంది (116 మంది) కి క్రిమినల్ హిస్టరీ ఉంది. కాంగ్రెస్ 29 మంది (57శాతం), జేడీయూ నుంచి 13 మంది, డీఎంకే నుంచి 10 మంది, టీఎంసి నుంచి తొమ్మిది మంది ఎంపీలకు నేరచరిత్ర ఉందట. 2014 లో 185 మంది (34 శాతం) పై నేర చరిత్రకు సంబంధించిన రికార్డులు వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై ఉన్నాయి. 17 వ లోక్ సభకు సంబంధించి 29 కేసులు రేప్, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ వంటివట .ఇక వైసీపీ కి చెందిన ఓ ఎంపీతో బాటు బీజేపీకి చెందిన 11 మంది, బీఎస్పీయేకి చెందిన ఇద్దరు, కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున వీరిపై తీవ్ర నేరాభియోగాలున్నాయి. భోపాల్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసి ఎన్నికైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ పై మాలెగావ్ బ్లాస్ట్ కేసు నిందితురాలన్న అభియోగం ఉండగా..కేరళలోని ఇడుక్కి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికైన దీన్ కురియా కేస్ మీద అత్యధికంగా 204 కేసులు దాఖలయ్యాయి. హత్యా యత్నం, హౌస్ ట్రెస్ పాస్, రాబరీ వంటివి ఈ కేసుల్లో ఉన్నాయి. ఇక-ఒడిశా అసెంబ్లీ విషయానికి వస్తే 67 మంది ఎమ్మెల్యేల మీద ఇలాంటి అభియోగాలున్నాయి.