కరోనా ఎఫెక్ట్.. ఆ ప్రయాణికులకు.. ఉచితంగా 2వేల ఐఫోన్లు..!

కరోనా వైరస్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డైమండ్ ప్రిన్సెస్ షిప్ లోని ప్రయాణికులకు జపాన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం గత కొద్ది రోజుల నుంచి ఆ నౌక యొకోహమా పోర్టులో నిలిపివేసిన షిప్‌లో దాదాపు 3700 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో దాదాపు 350 మంది కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయి. అయితే షిప్‌లోని ప్రయాణికులు, సిబ్బంది ఎప్పటికప్పుడు వైద్యులతో అందుబాటులో ఉండేందుకు.. జపాన్ ప్రభుత్వం.. షిప్‌లోని రెండు వేల మందికి ఉచితంగా […]

కరోనా ఎఫెక్ట్.. ఆ ప్రయాణికులకు.. ఉచితంగా 2వేల ఐఫోన్లు..!
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2020 | 5:19 AM

కరోనా వైరస్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డైమండ్ ప్రిన్సెస్ షిప్ లోని ప్రయాణికులకు జపాన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం గత కొద్ది రోజుల నుంచి ఆ నౌక యొకోహమా పోర్టులో నిలిపివేసిన షిప్‌లో దాదాపు 3700 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో దాదాపు 350 మంది కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయి. అయితే షిప్‌లోని ప్రయాణికులు, సిబ్బంది ఎప్పటికప్పుడు వైద్యులతో అందుబాటులో ఉండేందుకు.. జపాన్ ప్రభుత్వం.. షిప్‌లోని రెండు వేల మందికి ఉచితంగా ఐఫోన్లను పంపిణీ చేసింది.

కరోనా ఎఫెక్ట్ కారణంగా గత కొద్దిరోజులుగా ఈ షిప్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నౌకలోని ప్రయాణికులు, సిబ్బంది.. వైద్యులతో సంప్రదించేందుకు అనుగుణంగా ముందుస్తుగా లైన్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన 2వేల ఫోన్లను అందజేశారు. ప్రతి క్యాబిన్‌కు ఓ ఫోన్‌ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు వైద్యులు, సైకాలజిస్టులతో మాట్లాడేందుకు ప్రయాణికులకు వీలు కలుగుతుందని.. దీంతో పాటు నౌకలో ఎప్పుడేం జరుగుతోందో తెలుసుకునేందుకు వీలు పడుతుందన్నది జపాన్ సర్కార్ ఆలోచన.