హర్యానాలో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

హర్యానాలో భారీగా గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. హిసార్‌ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారం అందడంతో.. రెండు చోట్ల జరిపిన..

హర్యానాలో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 9:36 PM

హర్యానాలో భారీగా గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. హిసార్‌ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారం అందడంతో.. రెండు చోట్ల జరిపిన తనిఖీల్లో రెండు క్వింటాల్ల గంజాయి పట్టుబడిందని తెలిపారు. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేశామన్నారు. వీరు ఒడిషా నుంచి అక్రమంగా గంజాయిని తీసుకువచ్చి.. హర్యానా ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడ్డ వారిలో ఒకరు యూపీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలోని జిందాల్ బ్రిడ్జ్‌ ప్రాంతంలో 140 కిలోల గంజాయిని గుర్తించామని.. ఆరు ప్లాస్టిక్ బ్యాగుల్లో వీటిని యూపీకి చెందిన సుభాష్ అనే వ్యక్తి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మరో సంఘటనలో పంజాబ్‌కు చెందిన మరో వ్యక్తి అగ్రోహ టోల్ ప్లాజా వద్ద చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డాడని.. అతని వద్ద నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు ఘటనలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.