రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సామాన్య జనంపై కాల్పులు

-Year-Old Among 4 Injured In Terror Attack In J&K; Baby May Be Airlifted, రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సామాన్య జనంపై కాల్పులు" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/09/jk.png 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/jk-300x180.png 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/jk-768x461.png 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/jk-600x360.png 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి సామాన్య ప్రజలే టార్గెట్‌గా కాల్పులకు దిగారు. సోపోర్ జిల్లా డంగర్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ బాలికతో పాటుగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ బాలిక ఉస్మాజాన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *