ఆ ఇద్దరు పోలీసులపై వేటు.. రీజన్‌ ఇదే..!

యూపీలో పోలీసుల దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. మైనర్ పిల్లలతో ఏకంగా నాలాలో పడిఉన్న ఓ మృతదేహాన్ని తీయించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విషయం ఉన్నతాధికారుల చెవిలో పడటంతో ఆ పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. బులంద్‌ షహర్‌ జిల్లాలో ఓ మురికి కాలువలో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడి చేరుకుని కాలువ వద్ద పరిశీలించారు. అయితే మృతదేహాన్ని బయటకు తీసేందుకు […]

ఆ ఇద్దరు పోలీసులపై వేటు.. రీజన్‌ ఇదే..!
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 4:46 PM

యూపీలో పోలీసుల దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. మైనర్ పిల్లలతో ఏకంగా నాలాలో పడిఉన్న ఓ మృతదేహాన్ని తీయించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విషయం ఉన్నతాధికారుల చెవిలో పడటంతో ఆ పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. బులంద్‌ షహర్‌ జిల్లాలో ఓ మురికి కాలువలో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడి చేరుకుని కాలువ వద్ద పరిశీలించారు. అయితే మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.హోం గార్డులు అందుబాటులో లేకపోవడంతో.. స్థానికంగా ఉన్న మైనర్ బాలులతో ఆ మృతదేహాన్ని తీయించారు.

అయితే ఆ ఇద్దరు పోలీసులు మాత్రం పక్కనే ఉన్నారు. దీనికి సంబంధించిన తతంగాన్ని అంతా అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో అది కాస్త వైరల్ అయ్యింది. అసలు సంబంధం లేని వారితో అది కూడా మైనర్‌ బాలులతో మృతదేహం తీయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల చెవిలో పడింది. వెంటనే సదరు కానిస్టేబుల్స్ ఇద్దర్నీ సస్పెండ్ చేశారు.