Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

త్వరలో షాకింగ్ న్యూస్.. 2వేల నోటు రద్దు !

thousand note news, త్వరలో షాకింగ్ న్యూస్.. 2వేల నోటు రద్దు !" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/11/2000-rupee-_rbi.jpg 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/11/2000-rupee-_rbi-300x180.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/11/2000-rupee-_rbi-768x461.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/11/2000-rupee-_rbi-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

త్వరలో రెండు వేల రూపాయల నోటు రద్దు కాబోతోందా ? పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోందంటున్నారు ఆర్థిక నిఫుణులు, బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లు రద్దు అయ్యి శుక్రవారానికి సరిగ్గా మూడేళ్ళు. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థల్లో తమ తమ విశ్లేషణలను పంచుకున్న ఆర్థిక వేత్తలు త్వరలో 2 వేల నోటు రద్దయ్యే ఛాన్స్ కనిపిస్తుందని చెబుతున్నారు. బ్యాంకుల్లో జరుగుతున్న పరిణామాలు కూడా ఆ దిశగానే కొనసాగుతున్నాయని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

8 నవంబర్, 2016న రాత్రి 8 గం.లకు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటన ఏ ఒక్క భారతీయుని మదిలోంచి ఇంకా చెదిరిపోలేదు. దాదాపు ఆరు నెలల పాటు ప్రతీ సగటు భారతీయుడు నోట్ల రద్దుతో పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. ఆ తర్వాత సామాన్యులకు సమస్యలు తప్పినా… దేశ ఆర్థిక రంగంపై మాత్రం నోట్ల రద్దు ప్రభావం ఇంకా కొనసాగుతూనే వుంది. మూడేళ్ళు పూర్తయినా.. భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో వుండడానికి ఆనాటి నోట్ల రద్దే కారణమని ఆర్థిక వేత్తల అభిప్రాయం.

ఈ నేపథ్యంలో మరోసారి రెండు వేల రూపాయల నోటును రద్దు చేస్తారంటూ పెద్దగా ప్రచారం మొదలైంది. ఈ రద్దును పలువురు ఆర్థిక వేత్తలు, బ్యాంకింగ్ నిఫుణులు ఎండార్స్ చేస్తున్నారు. అయితే.. ఈ రద్దు ఆనాటి నోట్ల రద్దులాగా ఒకేసారి దేశంలో విధించబోరని.. క్రమంగా 2 వేల రూపాయల నోటును బ్యాంకులకు పరిమితం చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో చెలామణీలో వున్న కరెన్సీలో 2 వేల రూపాయల నోటు వాటా దాదాపు మూడో వంతు వుంటుంది. ఉదాహరణకు దేశంలో చెలామణీలో వున్న నగదు మొత్తం 24 లక్షల కోట్లు (కాస్త అటూ ఇటూగా) అనుకుంటే అందులో 8 లక్షల కోట్లు 2 వేల రూపాయల నోట్లే.

ఇప్పుడు ఈ నోట్లను పెద్ద ఎత్తున నిల్వ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోందని, క్రమంగా 2 వేల రూపాయల నోటు నల్లధనం దాచుకునే వారికి ఉపయోగకరంగా మారుతోందని ఆర్బీఐ వర్గాలు అంఛనా వేస్తున్నాయి. అందుకే 2 వేల రూపాయల నోటును క్రమంగా బ్యాంకులకే పరిమితం చేయాలని సూచిస్తున్నారు. బ్యాంకులకు తిరిగి వచ్చే రెండు వేల రూపాయల నోటును తిరిగి ఖాతాదారులకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇలా చెలామణీలో వున్న నోట్లలో 80-90 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చిన తర్వాత ఆర్బీఐ రంగంలోకి దిగి ఆ నగదును చిన్న 100, 200, 500 నోట్లతో కవర్ చేయాలని సూచిస్తున్నారు బ్యాంకింగ్ రంగ ఎక్స్‌పర్ట్స్‌.

ఈ సూచనకు ప్రధాన కారణం మన దేశం డిజిటల్ మనీ వినియోగంలో చాలా వెనకబడి వుండడమేనంటున్నారు. ఫలితంగా దేశంలో ఇప్పటికీ 85 శాతం నగదు లావాదేవీలే జరుగుతున్నాయని, దాంతో మళ్ళీ బ్లాక్ మనీ పెరిగిపోతుందని చెబుతున్నారు. ఈ నల్లధనాన్ని పెద్ద ఎత్తున దాచుకోవడానికి 2 వేల రూపాయల నోటు బాగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో దేశంలో డిజిటల్ మనీ వినియోగాన్ని పెంచడంతోపాటు నల్లధనాన్ని అరికట్టేందుకు 2 వేల రూపాయల సర్క్యులేషన్‌ని తగ్గించడమే ఉపయోగమని అంటున్నారు.

చైనాలో డిజిటల్ మనీ 87 శాతం కాగా.. మన దేశంలో ఇది 15 శాతం మాత్రమే. సో.. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు.. అంటే.. డిజిటల్ మనీ సర్క్యులేషన్‌ని పెంచడం, నల్లధనానికి చెక్ పెట్టడం.. ఇలా రెండు పనులు 2 వేల రూపాయల నోటు సర్క్యులేషన్‌ని తగ్గించడం వల్ల సాధ్యమవుతాయని అంటున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎన్.సి.గార్గ్ ఈ మేరకు చేసిన సూచనను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.