పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..

జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని డాలిపోరా ప్రాంతంలో ఇవాళ ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఒక ఇంట్లో ఆయుధాలతో దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ వీరమరణం పొందగా.. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

కాగా, భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు నక్కి ఉన్న ఇంటిని చుట్టుముట్టిన జవాన్లు.. ఇంకా కాల్పులు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మరో ముగ్గురు ఉగ్రవాదులు పరారయ్యారు. పారిపోయిన ముష్కరుల కోసం భద్రతా దళాలు కూంబింగ్ చేపడుతున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా పరిసర ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *