హస్తినలో గ్యాంగ్ వార్.. కాల్పుల్లో ఇద్దరు హతం

దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ వార్ జరిగింది. దక్షిణ ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తిని మరో కారు వెంబడిస్తూ.. అతడిపై 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పక్కనే ఉన్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని దుండగులపై కాల్పులు జరపగా.. వారిలో ఒకరు మృతి చెందాడు. మృతులను ప్రవీణ్ గెహ్లాట్, వికాస్ దలాల్‌గా పోలీసులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆస్తికి సంబంధించిన వివాదం కారణంగానే ఈ కాల్పులు జరిగాయని.. వీరిపై ఢిల్లీ, హర్యానాలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *