తిరుమల శ్రీవారికి భారీ విరాళం!

అమెరికాలో నివసించే ఇద్దరు ప్రవాస భారతీయ వ్యాపారులు శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి రూ.14 కోట్ల రూపాయలను కానుకగా సమర్పించినట్టు తితిదే అధికారులు తెలిపారు. పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని ఇద్దరు స్నేహితులు కుటుంబసమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రూ.14 కోట్ల విలువైన ఓవర్‌ డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఆలయ ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కానుక మొత్తాన్ని తితిదే నిర్వహిస్తున్న వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని వారు కోరారు. వీరిద్దరూ భారీ మొత్తంలో […]

తిరుమల శ్రీవారికి భారీ విరాళం!
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 5:13 AM

అమెరికాలో నివసించే ఇద్దరు ప్రవాస భారతీయ వ్యాపారులు శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి రూ.14 కోట్ల రూపాయలను కానుకగా సమర్పించినట్టు తితిదే అధికారులు తెలిపారు. పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని ఇద్దరు స్నేహితులు కుటుంబసమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రూ.14 కోట్ల విలువైన ఓవర్‌ డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఆలయ ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కానుక మొత్తాన్ని తితిదే నిర్వహిస్తున్న వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని వారు కోరారు. వీరిద్దరూ భారీ మొత్తంలో కానుకలు సమర్పించడం మొదటిసారేం కాదు. గతేడాది జులైలోనూ రూ.13.5 కోట్లను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆ మొత్తాన్ని కూడా తితిదే ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులు చేపట్టే సేవా కార్యక్రమాలకు వినియోగించాల్సిందిగా కోరారు.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!