Breaking News
  • హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో కేటీఆర్‌ పర్యటన. జలమండలి రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్క్‌ సందర్శన. నీటి సంరక్షణ పద్ధతులను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌. జలమండలి సిబ్బంది కోసం ప్రత్యేక యూనిఫామ్‌ ఆవిష్కరించిన కేటీఆర్.
  • ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న రేవంత్‌రెడ్డి భూ బాధితులు. రాజేంద్రనగర్‌ ఆర్డీవో ఆఫీసుకు క్యూకడుతున్న బాధితులు. గోపన్‌పల్లిలోని 127, 128 సర్వే నెంబర్లతో పాటు... మరో భూమిని కబ్జాచేశారని ఆరోపణలు. 124 సర్వే నెంబర్‌ భూమిని కూడా కబ్జా చేశారని ఆరోపణ. 124 సర్వేనెంబర్‌లోని రెండెకరాల భూమిని కబ్జా చేశారంటున్న బాధితులు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి అనుచరులు కబ్జాచేశారని ఆర్డీవోకు ఫిర్యాదు.
  • పోలవరంలో ముగిసిన సీఎం జగన్‌ పర్యటన. రెండు గంటల పాటు అధికారులతో సమీక్షించిన సీఎం.
  • చిత్తూరు: గంగవరం మండలం పత్తికొండలో చెట్టుకు ఉరేసుకుని పదో తరగతి విద్యార్థి సుధీర్‌ ఆత్మహత్య.
  • సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించడం పట్ల జనసేన హర్షం. సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌.
  • ఈ ఏడాది తొలిసారి భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు. 1,448 పాయింట్లు నష్టపోయి 38,297 దగ్గర ముగిసిన సెన్సెక్స్‌. 431 పాయింట్లు నష్టపోయి 11,201 దగ్గర ముగిసిన నిఫ్టీ.

బెంగాల్‌లో ఘర్షణలు.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

West Bengal, బెంగాల్‌లో ఘర్షణలు.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి మొదలైన రాజకీయ ఘర్షణలు బెంగాల్‌లో ఇంకా కొనసాగుతున్నాయి. టీఎంసీ, బీజేపీల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా.. పలువురు టీఎంసీ కార్యకర్తలు కూడా చనిపోయారు. తాజాగా భట్ పరా ప్రాంతంలో జరిగిన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలుకోల్పోయారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. శాంతి భద్రతలు అదుపులో వచ్చేందుకు 144 సెక్షన్‌ను విధించారు. భట్ పరా, జగద్దర్ ప్రాంతాల్లో షాపులను అధికారులు మూసివేయించారు. అలాగే రాష్ట్రంలో పలు చోట్ల ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. బెంగాల్‌లో జరుగుతున్న రాజకీయ ఘర్షణలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. కుట్రపూరితంగా ఈ దాడులు చేస్తోందని విమర్శలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ అన్నారు.

Related Tags