షాకింగ్‌… తబ్లీఘీ జమాత్‌ దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కరోనా..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తొలుత నామమాత్రంగా కేసులే నమోదైనప్పటికీ… తబ్లీఘీ జమాత్‌ వ్యవహారం బయటపడ్డాక.. కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అయితే దేశ వ్యాప్తంగా కోనసాగుతున్న లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలతో..తబ్లీఘీ జమాత్‌ చీఫ్ మౌలానా సాద్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న ఇద్దరు పోలీసులకు కూడా కరోనా సోకడం ఇప్పుడు కలకలం రేపుతోంది. […]

షాకింగ్‌... తబ్లీఘీ జమాత్‌ దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కరోనా..
Follow us

| Edited By:

Updated on: May 02, 2020 | 3:27 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తొలుత నామమాత్రంగా కేసులే నమోదైనప్పటికీ… తబ్లీఘీ జమాత్‌ వ్యవహారం బయటపడ్డాక.. కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అయితే దేశ వ్యాప్తంగా కోనసాగుతున్న లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలతో..తబ్లీఘీ జమాత్‌ చీఫ్ మౌలానా సాద్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న ఇద్దరు పోలీసులకు కూడా కరోనా సోకడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ కేంద్రంగా.. తబ్లీగ్ జమాత్ పెద్ద ఎత్తున మీటింగ్‌లు నిర్వహించింది. అయితే ఈ ఘటనపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా.. ఇద్దరు పోలీసులు తబ్లీగ్ జమాత్ చీఫ్ ఫాం హౌస్‌తో పాటుగా మర్కజ్‌ను కూడా సందర్శించారు. అయితే సందర్శించిన పోలీసులిద్దరికీ కరోనా లక్షణాలు కనిపించడంతో.. వారికి కరోనా పరీక్షలు చేయించారు. దీంతో రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వీరితో సన్నిహితంగా ఉన్న మరో పన్నెండు మంది పోలీసులను క్వారంటైన్‌కు తరలించారు.