రాహుల్‌ గాంధీపై సోషల్ మీడియాలో పోస్టులు.. ఇద్దరి కేసులు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర పోలీస్ స్టేషన్‌లో యూపీ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ముఖేష్ దంగర్, మధు కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్‌ ఉమేష్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీపై పెట్టిన పోస్టులు తమ మనోభావాలను గాయపర్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పోస్టింగ్‌లు పెడుతున్న […]

రాహుల్‌ గాంధీపై సోషల్ మీడియాలో పోస్టులు.. ఇద్దరి కేసులు
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 8:56 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర పోలీస్ స్టేషన్‌లో యూపీ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ముఖేష్ దంగర్, మధు కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్‌ ఉమేష్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీపై పెట్టిన పోస్టులు తమ మనోభావాలను గాయపర్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పోస్టింగ్‌లు పెడుతున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. అందులో ఒకరు చౌదరి సంకేత్ అగర్వాల్ అని గుర్తించారు. ఐటీ యాక్ట్‌ (సవరణ) 2008,ఐపీసీ 295 సెక్షన్‌ కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.