గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారుతున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డగా మారుతోంది. కస్టమ్స్ అధికారుల తనికీల్లో వరుసగా బంగారం పట్టుబడటం కలకల రేపుతోంది. దుబాయ్ నుంచి వచ్చే ప్రయణికుల వద్ద కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతోంది. తాజాగా.. శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ షార్జా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. అతని వద్ద ఉన్న ఐరన్ రాడ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాడ్ లోపలి భాగాన్ని విడగొట్టి చూడగా.. అందులో 2.3 కిలోల […]

గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారుతున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు
Follow us

| Edited By:

Updated on: Mar 18, 2019 | 11:07 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డగా మారుతోంది. కస్టమ్స్ అధికారుల తనికీల్లో వరుసగా బంగారం పట్టుబడటం కలకల రేపుతోంది. దుబాయ్ నుంచి వచ్చే ప్రయణికుల వద్ద కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతోంది. తాజాగా.. శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ షార్జా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. అతని వద్ద ఉన్న ఐరన్ రాడ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాడ్ లోపలి భాగాన్ని విడగొట్టి చూడగా.. అందులో 2.3 కిలోల బంగారం బయటపడింది. ఎవరికీ అనుమానం రాకుండా కన్నుగప్పి తప్పించుకోవాలని చూశాడు. అయితే.. అతని ప్రవర్తనపై అనుమానంతో అధికారులు లోతుగా తనిఖీ చేయడంతో దొరికిపోయాడు.