32ఏళ్ల యువతిపై 19ఏళ్ల యువకుడు అత్యాచారం

హైద‌రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో న‌మ్మించి 32ఏళ్ల యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు 19 ఏళ్ల యువకుడు.

32ఏళ్ల యువతిపై 19ఏళ్ల యువకుడు అత్యాచారం
young man attacks woman
Follow us

|

Updated on: Sep 04, 2020 | 10:33 AM

హైద‌రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో న‌మ్మించి 32ఏళ్ల యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు 19 ఏళ్ల యువకుడు. ఈ ఘ‌ట‌న బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం… ఎర్రకుంటలో ఉండే యువకుడు(19) ఆ ప‌క్క‌న ఏరియాలో నివ‌శించే పెళ్లికాని 32ఏళ్ల యువతిని సంవ‌త్స‌ర‌కాలంగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయ‌మాట‌లు చెప్పి.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల పెళ్లి చేసుకోవాలని యువ‌తి కోర‌గా, అందుకు నిరాక‌రించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్ర‌యించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గురువారం రిమాండ్‌కు తరలించారు.

Also Read :

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు : తాజా రేట్లు ఇలా !