18 మంది మావోలు లొంగుబాటు.. ఉద్యోగాలిప్పిస్తామన్న అధికారులు..

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ జిల్లాలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఎదుట 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు సంస్థకు చెందిన అనుబంధ..

18 మంది మావోలు లొంగుబాటు.. ఉద్యోగాలిప్పిస్తామన్న అధికారులు..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 12:04 PM

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ జిల్లాలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఎదుట 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు సంస్థకు చెందిన అనుబంధ సంస్థల నేతలు కూడా వీరిలలో ఉన్నారు. చేతన నాట్యమండలి, దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్‌ సంఘటన్‌ సంస్థలకు చెందిన మావోయిస్టులు పోలీసుల ఎదుట ఆయుధాలతో లొంగిపోయారు. గత కొద్ది రోజులుగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలంటూ.. “లోన్ వరటూ..” (రిటర్న్‌ టూ హోమ్) కార్యక్రమం చేపడుతున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే.. నక్సలిజాన్ని వదిలి.. పద్దెనిమిది మంది మావోయిస్టుల పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో పలువురు మహిళలు కూడా ఉన్నారు. వీరందరికీ టైలరింగ్‌, డ్రైవింగ్, నిర్మాణ పనుల్లో ట్రైనింగ్ ఇచ్చి.. ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని.. ఎస్పీ అభిషేక్ పల్లవ్‌ తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టులు అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. పలువురు రైల్వే ట్రాక్‌లను బ్రేక్‌ చేసిన వారు ఉండగా.. మరికొందరు స్కూల్స్‌ను కూల్చివేసిన ఘటనల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. కొందరిపై లక్ష రూపాయల రివార్డ్‌ కూడా ఉందని అధికారులు వెల్లడించారు. వారిపై ఉన్న రివార్డులను వారికే అందించి.. వారు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక మరో సీనియర్ మావోయిస్టు కమాండర్‌ను ఐటీబీపీ పోలీసులు అరెస్ట్ చేశామని.. అతడికి బుల్లెట్‌ గాయమైందని తెలిపారు. ప్రస్తుతం అతడినిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.