జ్ఞానస ఎక్కడుంది..? తల్లి చెప్పిందే నిజమా..? మిస్టరీగా చిన్నారి అదృశ్యం..!

క్షణికావేశం వారి పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టింది. ఓ చిన్న విషయంలో భార్య, భర్త మధ్య జరిగిన గొడవ.. ఏడాదిన్నర చిన్నారి పాలిట శాపమైంది. ఐదు రోజులైనా ఆ చిన్నారి ఆచూకీ కనిపించలేదు. అసలు ఆ బిడ్డ బ్రతికే ఉందా..? లేక చనిపోయిందా..? కుమార్తె చనిపోయిందని చెప్పిన తల్లి ఆ చిన్నారిని ఎక్కడ పూడ్చిపెట్టింది..? ఈ ప్రశ్నలన్నింటిని చేధించే పనిలో పడ్డారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తి పులగవానిపాలెం ప్రాంతానికి చెందిన కరక అప్పారావు విజయనగరం జిల్లా గజపతినగరం […]

జ్ఞానస ఎక్కడుంది..? తల్లి చెప్పిందే నిజమా..? మిస్టరీగా చిన్నారి అదృశ్యం..!
Follow us

| Edited By:

Updated on: Feb 11, 2020 | 5:02 PM

క్షణికావేశం వారి పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టింది. ఓ చిన్న విషయంలో భార్య, భర్త మధ్య జరిగిన గొడవ.. ఏడాదిన్నర చిన్నారి పాలిట శాపమైంది. ఐదు రోజులైనా ఆ చిన్నారి ఆచూకీ కనిపించలేదు. అసలు ఆ బిడ్డ బ్రతికే ఉందా..? లేక చనిపోయిందా..? కుమార్తె చనిపోయిందని చెప్పిన తల్లి ఆ చిన్నారిని ఎక్కడ పూడ్చిపెట్టింది..? ఈ ప్రశ్నలన్నింటిని చేధించే పనిలో పడ్డారు పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తి పులగవానిపాలెం ప్రాంతానికి చెందిన కరక అప్పారావు విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఆరేళ్ల కిందట కుసుమలతతో వివాహమైంది. వీరికి సోనిక, జ్ఞానస అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఓ విషయంలో కుసుమలతకు.. ఆమె అత్తామామలకు మధ్య ఇటీవల గొడవ జరిగింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న రాత్రి 2.30గం.ల సమయంలో చిన్నపాప జ్ఞానస ఏడవడంతో.. బాత్‌రూమ్‌కు తీసుకెళ్లింది కుసుమలత. ఆ తరువాత చాలాసేపు గడిచినా ఆమె లోపలికి రాకపోవడంతో.. భర్త అప్పారావు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆ తరువాత ఆమె అదృశ్యంపై 7వ తేదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక ఇంటి నుంచి పాపతో అదృశ్యమైన కుసుమలత పలు ప్రాంతాల్లో సంచరించి.. నిద్ర, తిండి లేక నీరసంగా తయారైంది. ఆమె సెల్‌ఫోన్ కాల్‌డేటా, టవర్ లొకేషన్, కాల్‌లిస్ట్ తదితర ఆధారాలతో చినముషిడివాడలోని వుడా కాలనీ శివారు కొండ ప్రాంతంలో కుసుమలత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక అదే ప్రాంతంలో మేకలు మేపుతున్న కొందరు ఒంటరిగా కుసుమలతను చూసి వారి ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో కుసుమలతను అదుపులోకి తీసుకున్న పోలీసులు జ్ఞానస గురించి ప్రశ్నించగా.. కుమార్తె పాలు లేక ఏడుస్తూ చనిపోయిందని చెప్పింది. మృతదేహం గురించి ప్రశ్నించగా.. కొండ ప్రాంతంలో పూడ్చినట్లు చెప్పింది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా.. ఎక్కడా ఆ చిన్నారి మృతదేహం కనిపించలేదు. దీంతో ఎర్రకొండపై ఆమె కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. జ్ఞానస ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా పోలీసులు విడిపోయారు. డాగ్‌స్క్వాడ్‌తో ఎర్రకొండపై గాలిస్తున్నట్లు ఏసీపీ స్వరూపారాణి చెబుతున్నారు. మనస్తాపంతో కుసుమలత ఆత్మహత్య చేసుకోవాలనుకుందని.. చేతికి ఉన్న ఉంగరాలు మింగేసిందని.. వైద్యపరీక్షల్లో కుసుమలత కడుపులో రెండు ఉంగరాలు కనిపించాయని ఏసీపీ అంటున్నారు. ఇక జ్ఞానస మృతదేహాన్ని జంతువులు ఏమైనా తినేశాయా..? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు స్వరూపారాణి చెప్పారు.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు