సూడాన్‌లో కూలిన మిలిటరీ విమానం.. 18 మంది మృతి!

సూడాన్ సైనిక రవాణా విమానం కూలి 18 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని ఎల్ జెనీనాలోని వెస్ట్ డార్ఫర్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఐదు నిమిషాల తరువాత విమానం కూలిపోయింది. “ఎల్ జెనీనా నుండి బయలుదేరిన ఆంటోనోవ్ 12 సైనిక విమానం గురువారం రాత్రి కుప్పకూలింది, దానిలో ఏడుగురు సిబ్బంది, ముగ్గురు న్యాయమూర్తులు, ఎనిమిది మంది పౌరులు, నలుగురు పిల్లలు ఉన్నారు” అని ప్రతినిధి అమేర్ మొహమ్మద్ అల్-హసన్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు జరుగుతోందని […]

సూడాన్‌లో కూలిన మిలిటరీ విమానం.. 18 మంది మృతి!
Follow us

| Edited By:

Updated on: Jan 03, 2020 | 12:34 PM

సూడాన్ సైనిక రవాణా విమానం కూలి 18 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని ఎల్ జెనీనాలోని వెస్ట్ డార్ఫర్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఐదు నిమిషాల తరువాత విమానం కూలిపోయింది. “ఎల్ జెనీనా నుండి బయలుదేరిన ఆంటోనోవ్ 12 సైనిక విమానం గురువారం రాత్రి కుప్పకూలింది, దానిలో ఏడుగురు సిబ్బంది, ముగ్గురు న్యాయమూర్తులు, ఎనిమిది మంది పౌరులు, నలుగురు పిల్లలు ఉన్నారు” అని ప్రతినిధి అమేర్ మొహమ్మద్ అల్-హసన్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.

సూడాన్ మిలటరీ, పౌర విమానాలలో చాలావరకు పాత సోవియట్ నిర్మిత విమానాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో సూడాన్ లో తరచూ విమాన ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాలకు సైన్యం సాంకేతిక సమస్యలు, వాతావరణం కారణమని పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో సూడాన్ లో ఘోరమైన గిరిజన ఘర్షణలు సంభవించాయి. ఆ హింసలో కనీసం 48 మంది మరణించగా, 241 మంది గాయపడ్డారని రెడ్ క్రెసెంట్ తెలిపింది. ఎల్ జెనీనాలో ఆదివారం రాత్రి అరబ్, ఆఫ్రికన్ సమూహాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.