యూపీలో జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్ల కలకలం.. దర్యాప్తు చేస్తున్న ఈసీ

మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం కానున్న వేళ యూపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని ఓ బ్యాంకులో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. దాదాపు 1700 జన్‌ధన్ అకౌంట్లలో రూ.10,000/- చొప్పున మొత్తం రూ. 1.7 0 కోట్లు  డిపాజిట్ అయ్యాయి. అయితే ఈ డిపాజిట్లపై ఆ ప్రాంతంలో పుకార్లు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనీ.. దేశంలోని అందరి జన్‌ధన్ అకౌంట్లలో రూ.10,000/- చోప్పున డబ్బులు వేస్తోందన్న ప్రచారం […]

యూపీలో జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్ల కలకలం.. దర్యాప్తు చేస్తున్న ఈసీ
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2019 | 3:24 PM

మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం కానున్న వేళ యూపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని ఓ బ్యాంకులో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. దాదాపు 1700 జన్‌ధన్ అకౌంట్లలో రూ.10,000/- చొప్పున మొత్తం రూ. 1.7 0 కోట్లు  డిపాజిట్ అయ్యాయి. అయితే ఈ డిపాజిట్లపై ఆ ప్రాంతంలో పుకార్లు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనీ.. దేశంలోని అందరి జన్‌ధన్ అకౌంట్లలో రూ.10,000/- చోప్పున డబ్బులు వేస్తోందన్న ప్రచారం మొదలైంది. అయితే దీనిపై బీజేపీ ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. మరోవైపు ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు.. బీజేపీనే ఇలాంటి ఘటనకు పాల్పడి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పుకార్లు షికార్లు చేస్తుండటంతో నిఘా వర్గాలు, ఐటీ శాఖ రంగంలోకి దిగాయి. బ్యాంక్ ప్రతినిధులే ఈ డబ్బు డిపాజిట్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. మరోవైపు జన్‌ధన్ ఖాతాల్లో డబ్బు డిపాజిట్‌పై అలర్ట్ అయిన ఎన్నికల సంఘం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టింది.