చైనాలో మరో దారుణం.. ప్లాంట్‌లో భారీ పేలుడు..

చైనాలోని ఫుక్సిన్‌ నగరంలో భారీ పేలుడు సంభవించింది. నార్త్ ఈస్ట్ చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిహేదు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన..

చైనాలో మరో దారుణం.. ప్లాంట్‌లో భారీ పేలుడు..
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 6:03 PM

చైనాలోని ఫుక్సిన్‌ నగరంలో భారీ పేలుడు సంభవించింది. నార్త్ ఈస్ట్ చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిహేదు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి స్థానికంగా ఉన్న కార్మికుల ఇంటి అద్దాలు బద్దలయ్యాయి. మరికొన్ని పగుళ్లు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎవరు మరణించలేదని.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాగా, పేలుడుకు గల కారణాలపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నామని.. ఘటనపై కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.