కేరళ విమాన ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

కేరళలో శుక్రవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దుబాయి్‌ నుంచి వస్తున్న ఎయిర్‌ ఇండియాకు చెందిన ఎక్స్‌ప్రెస్ విమానం.. రన్‌వేపై నుంచి జారి 35 అడుగుల లోయలోకి..

కేరళ విమాన ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 6:50 AM

కేరళలో శుక్రవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దుబాయి్‌ నుంచి వస్తున్న ఎయిర్‌ ఇండియాకు చెందిన ఎక్స్‌ప్రెస్ విమానం.. రన్‌వేపై నుంచి జారి 35 అడుగుల లోయలోకి పడిపోయింది. అంతేకాదు.. ఒక్కసారిగా రెండు ముక్కలయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 190 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు విమాన సిబ్బంది కాగా.. మిగతా వారంతా ప్రయాణికులు. ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్‌తో సహా.. మొత్తం పదిహేడు మంది మృతిచెందారు. మరో 120 మందికి పైగా గాయపడ్డారు. విమానంలో చిక్కుకుపోయిన పలువురు ప్రయాణికులను రెస్క్యూ టీం సురక్షితంగా బయటకు తీసింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదం పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. మోదీ సీఎం పినరయ్ విజయన్‌కు ఫోన్ చేసి సహాయక చర్యల గురించి ఆరా తీశారు.

శుక్రవారం రాత్రి 7.41 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 190 మంది ఉన్నారు. వీరిలో 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు, ఇద్దరు పైలట్లు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో.. ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే.. మల్లపురం, వయనాడ్‌ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

Read More :

కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే

డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..