Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • డీఆర్డీవో నిర్మించిన ఆస్పత్రిలో అన్ని రకాల సదుపాయాలున్నాయి. ఇక్కడ వైద్యం పూర్తిగా ఉచితం. ఆర్మీ వైద్యులు సైవలందిస్తారు. కంటోన్మెంట్లోని చెత్త డంపింగ్ ప్రాంతాన్ని చదును చేసి సర్దార్ పటేల్ ఆస్పత్రిగా మార్చాం. డీఆర్డీవో ఇప్పటి వరకు 70 రకాల దేశీయ వైద్య ఉత్పత్తులు తయారు చేసింది. నెలకు 25,000 వెంటిలేటర్లు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాం. దేశీయ అవసరాలు పోను ఎగుమతి చేసేందుకు కూడా సిద్ధం. జి. సతీశ్ రెడ్డి, డీఆర్డీఓ ఛైర్మన్.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • చెన్నై : హాస్పిటల్ మూసివేత. చెన్నైలోని విజయా హాస్పిటల్లో కరోనా కలకలం. 50 మందికి పైగా హాస్పిటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్. కరోనా తో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ రెడ్డి మృతి. హాస్పిటల్ ఈమెర్జెన్సీ సర్వీసులు నిలిపివేత. హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషేంట్ లను ఇతర హాస్పిటల్స్ కు తరలింపు. హాస్పిటల్ లో సిబ్బందికి, వచ్చిన రోగులకు కరోనా టెస్టులు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తరచూ వైద్యం కోసం విజయ హాస్పిటల్ కు వెళుతున్న వారిలో ఆందోళన.
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

యూపీలో ర్యాగింగ్‌ భూతం… 150 మంది జూనియర్‌ విద్యార్థులకు గుండ్లు!

50 first-year MBBS students forced to shave heads, యూపీలో ర్యాగింగ్‌ భూతం… 150 మంది జూనియర్‌ విద్యార్థులకు గుండ్లు!" srcset="https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/08/UP-Medical-College-ragging.jpg 780w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/08/UP-Medical-College-ragging-300x180.jpg 300w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/08/UP-Medical-College-ragging-768x461.jpg 768w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/08/UP-Medical-College-ragging-600x360.jpg 600w, https://tv9telugumedia.s3.amazonaws.com/wp-content/uploads/2019/08/UP-Medical-College-ragging-200x120.jpg 200w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

యూపీలోని ఓ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ భూతం వెలుగు చూసింది. దాదాపు 150 మందికి పైగా జూనియర్‌ విద్యార్థులు గుండు చేయించుకుని.. సీనియర్లకు సెల్యూట్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. సైఫాయ్ గ్రామంలోని ఉత్తర ప్రదేశ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ కాలేజీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియలో తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ వీడియోలో 150 మంది వరకు ఫస్టియర్‌ విద్యార్థులు గుండు చేయించుకుని.. వరుసలో నడుస్తూ.. సీనియర్లకు భక్తితో నమస్కరిస్తున్నారు. ఆ సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్‌ అక్కడే ఉన్నాడు. కానీ అతడు దీన్ని ఆపడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.

దీని గురించి కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ‘మా కళాశాలలో ర్యాగింగ్‌ని నిషేధించి చాలా కాలమవుతుంది. కాలేజీలో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాం. ఇందుకు కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించాం. ప్రస్తుతం జరిగిన సంఘటన గురించి పూర్తిగా విచారణ జరుపుతాం. ఇందుకు బాధ్యులైన వారిమీద కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

Related Tags