బాబా.. ఈ లక్షల నాణేలను ఏం చేయాలి..?

దేశంలోని అత్యున్నత సంపద గల దేవాలయాల్లో ఒకటిగా చెలామణి అవుతున్న షిర్డీ ఆలయానికి.. రాను రాను భక్తుల నుంచి డొనేషన్లు పెరుగుతున్నాయి. అయితే ఈ డొనేషన్లు నాణేల రూపంలో రావడంతో.. షిర్డీ ధర్మ సంస్థాన్‌కు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటోంది. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాది రూపాయల నాణేలు హుండీని ముంచెత్తుతున్నాయి. ప్రతి వారం రూ.14లక్షలు విలువ చేసే నాణేలను హుండీలో వేస్తుండటంతో.. ఇదో పెద్ద సమస్యగా మారింది. పైగా వీటిని స్వీకరించేందుకు తగినంత […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:31 pm, Tue, 18 June 19

దేశంలోని అత్యున్నత సంపద గల దేవాలయాల్లో ఒకటిగా చెలామణి అవుతున్న షిర్డీ ఆలయానికి.. రాను రాను భక్తుల నుంచి డొనేషన్లు పెరుగుతున్నాయి. అయితే ఈ డొనేషన్లు నాణేల రూపంలో రావడంతో.. షిర్డీ ధర్మ సంస్థాన్‌కు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటోంది. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాది రూపాయల నాణేలు హుండీని ముంచెత్తుతున్నాయి. ప్రతి వారం రూ.14లక్షలు విలువ చేసే నాణేలను హుండీలో వేస్తుండటంతో.. ఇదో పెద్ద సమస్యగా మారింది. పైగా వీటిని స్వీకరించేందుకు తగినంత స్థలం లేకపోవడంతో బ్యాంకులు కూడా నిరాకరిస్తున్నాయి.

దీనిపై శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌ సీఈవో దీపక్ ముగ్లికర్ మాట్లాడుతూ.. ‘‘వారానికి రెండు సార్లు మేము హుండీని లెక్కిస్తాం. అప్పుడు సుమారుగా 2కోట్ల రూపాయాలు హుండీ ద్వారా ట్రస్ట్‌కు చేరుతుంది. అయితే అందులో 7లక్షల రూపాయలు విలువ చేసే నాణేలు ఉంటాయి. వీటిని తీసుకునేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. వాటిని ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు’’ అని తెలిపారు. కాగా షిర్డీ సంస్థాన్ ట్రస్ట్‌కు ఎనిమిది బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అయితే అవన్నీ నాణేలను తీసుకునేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారం కోసం ఇటీవల ట్రస్ట్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఓ దరఖాస్తు పెట్టుకుంది.