కల్లు తాగుతున్నారా..! త‌స్మాత్ జాగ్ర‌త్త‌…

లాక్ డౌన్ స‌మ‌యంలో లిక్కర్ దొర‌క్క‌పోవ‌డంతో మందుబాబులు క‌ల్లువైపు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. అయితే ఇదే స‌మయంలో కొంద‌రు ప్ర‌బుద్దులు క‌ల్లు పేరుతో ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు. మదురైలో మత్తు కోసం నిద్ర మాత్రలు కలిపిన పానియాన్ని కల్లు పేరుతో అమ్ముతోన్న‌ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సారా, కల్లు విక్రయాలు ఊపందుకున్నాయి. మదురై కరుప్పాయి ఊరని వీరవంజన్‌ ఓడైపట్టి ఏరియాలో కల్లు విక్రయిస్తున్నట్టు కరుక్కూరని పోలీసులకు ఇన్ఫ‌ర్మేష‌న్ అందింది. వెంటనే అక్క‌డికి […]

కల్లు తాగుతున్నారా..!  త‌స్మాత్ జాగ్ర‌త్త‌...
Follow us

|

Updated on: Apr 21, 2020 | 4:47 PM

లాక్ డౌన్ స‌మ‌యంలో లిక్కర్ దొర‌క్క‌పోవ‌డంతో మందుబాబులు క‌ల్లువైపు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. అయితే ఇదే స‌మయంలో కొంద‌రు ప్ర‌బుద్దులు క‌ల్లు పేరుతో ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు. మదురైలో మత్తు కోసం నిద్ర మాత్రలు కలిపిన పానియాన్ని కల్లు పేరుతో అమ్ముతోన్న‌ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సారా, కల్లు విక్రయాలు ఊపందుకున్నాయి. మదురై కరుప్పాయి ఊరని వీరవంజన్‌ ఓడైపట్టి ఏరియాలో కల్లు విక్రయిస్తున్నట్టు కరుక్కూరని పోలీసులకు ఇన్ఫ‌ర్మేష‌న్ అందింది. వెంటనే అక్క‌డికి వెళ్లిన‌ ఇన్‌ స్పెక్టర్‌ మాడస్వామి టీమ్ గోమతిపురంలో రామ్‌కుమార్, శేఖర్, మణికంఠన్, ఈశ్వరన్‌ను అరెస్ట్ చేసి స్టేష‌న్ కు త‌ర‌లించారు. విచారణలో పులిసిపోయిన గంజి నీళ్లలో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి కల్లు తయారు చేసి అమ్ముతున్న‌ట్లు తేలింది. వారిని వ‌ద్ద నుంచి నిద్ర మాత్రలు కలిపిన 130 లీటర్ల నకిలీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. తమిళ‌నాడులోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌ల్లు విక్ర‌యాలు జోరందుకున్నాయి. కాక‌పోతే కొన్ని చోట్లు పిండినీళ్లలో మ‌త్తు ప‌దార్థాలు క‌లిపి క‌ళ్లు పేరుతో అమ్ముతార‌ని వార్త‌లు వస్తున్నాయి.