లారీని ఢీకొన్న బస్సు.. కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలోని కర్నూల్‌లో ఘోర ప్రమాదం జరిగిన కొన్ని గంటలు కూడా గడవకముందే తెలంగాణాలోని కరీంనగర్‌లో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌ దగ్గర ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 23మందికి గాయాలు అవ్వగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వగా.. డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టి.. డ్రైవర్‌ను బయటకు తీశారు. హైదరాబాద్ నుంచి మెట్‌పల్లి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *