Delhi Violence : ఢిల్లీ అల్లర్లలో 13కి చేరిన మృతుల సంఖ్య..CBSE పరీక్షలు వాయిదా

సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. గత రెండు.. మూడు రోజులుగా చోటుచేసుకున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 13 మంది మృతిచెందారు. వీరిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. మరో 150 మందికి పైగా గాయాలపాలయ్యారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ట్విటర్‌ వేదికగా […]

Delhi Violence : ఢిల్లీ అల్లర్లలో 13కి చేరిన మృతుల సంఖ్య..CBSE పరీక్షలు వాయిదా
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2020 | 6:07 AM

సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. గత రెండు.. మూడు రోజులుగా చోటుచేసుకున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 13 మంది మృతిచెందారు. వీరిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. మరో 150 మందికి పైగా గాయాలపాలయ్యారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ ప్రాంతాల్లో బుధవారం జరగాల్సిన టెన్త్, సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు.. పోలీసులు.. కేంద్ర బలగాలు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కర్నాల్ నగర్, జాఫరాబాద్, మౌజ్‌పూర్, చాంద్ బాగ్‌‌,కర్వాల్, బాబర్‌పూర్‌ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.