దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 12,584 పాజిటివ్ కేసులు, 167 మరణాలు..

Corona Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మరణాల తీవ్రతకు మాత్రం…

  • Ravi Kiran
  • Publish Date - 12:38 pm, Tue, 12 January 21
Corona Cases India

Corona Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మరణాల తీవ్రతకు మాత్రం బ్రేక్ పడట్లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,584 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,79,179 చేరుకుంది. ఇందులో 2,16,558 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,01,11,294 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 167 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో.. దేశంలో ఇప్పటివరకు 1,51,327 కరోనా మరణాలు సంభవించాయి.

అటు గత కొద్దిరోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అయితే మరణాల తీవ్రతలో మాత్రం తగ్గుదల ఇంకా కనిపించట్లేదు. ఈ తరుణంలో యూకేలో బయటపడిన కొత్త కరోనా వైరస్ ‘స్ట్రెయిన్’.. భారతదేశంలోనూ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు బాగా పెరిగింది. దేశంలో సోమవారం 18,385 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.07 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.44 శాతానికి తగ్గింది. దేశంలో 96.49 శాతానికి రికవరీ రేటు చేరిందంది.