Breaking News
  • భారత సైనిక విమానానికి చైనా అనుమతి. నేడు వూహాన్‌ వెళ్లనున్న వైద్య పరికరాలతో కూడిన సైనిక విమానం.చైనా అధికారులకు వైద్య పరికరాలు అందజేయనున్న అధికారులు. 27న వూహాన్‌ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురానున్న విమానం.
  • నేటి నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.11 రోజుల పాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు.వచ్చే నెల 4న స్వామి కల్యాణం, 5న రథోత్సవం.ఉత్సవాల సందర్భంగా నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం రద్దు.
  • నేటి నుంచి ఏపీ లోకాయుక్త కార్యకలాపాలు. ఇప్పటి వరకు ఒకేచోట ఉన్న ఏపీ, తెలంగాణ లోకాయుక్తలు.హైదరాబాద్‌ ఆదర్శనగర్‌లోని ఓ భవనంలోకి మారుతున్న లోకాయుక్త.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు
  • ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ. మౌజ్‌పూర్‌, జాఫరాబాద్‌, కర్నాల్‌నగర్‌, చాంద్‌బాగ్‌లో కర్ఫ్యూ.సీఏఏ అల్లర్ల నేపథ్యంలో కర్ఫ్యూ విధించిన పోలీసులు.ఆందోళనల్లో ఇప్పటి వరకు 13 మంది మృతి. ఢిల్లీ సరిహద్దులను మూసివేసిన పోలీసులు.
  • ఈశాన్య ఢిల్లీలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన మనీష్‌ సిసోడియా.నేడు జరగాల్సిన 10, 12 తరగతుల పరీక్షలు వాయిదా.తూర్పు, ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో వాయిదా.
  • ఇండోనేషియాలో వరద బీభత్సం.జకార్తాను ముంచెత్తిన వరదలు.భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న నదులు.వరద నీటిలో చిక్కుకున్న అధ్యక్ష భవనం.జలదిగ్భందంలో వేలాది ఇళ్లు.ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.

12 ఏళ్ళ అమ్మాయి..ఇక జైన సన్యాసిని

SURAT GIRL 12, TO BECOME JAIN MONK, PARENTS SAY PROUD, 12 ఏళ్ళ అమ్మాయి..ఇక జైన సన్యాసిని

ఈ ప్రపంచంలోని సుఖాలు, భోగాలు అన్నీ అశాశ్వతమని, మోక్షం ఒక్కటే ఇహలోకం నుంచి మనిషిని దూరం చేస్తుందని అంటోంది ఆ కాబోయే బాల సన్యాసిని. ఎక్కడో హిమాలయాలలోనో, జైన, లేదా బౌధ్ధ క్షేత్రాలలోనో కూర్చుని ఆమె ఈ మాటలనడం లేదు. గుజరాత్ లోని సూరత్ లో నివసిస్తున్న 12 ఏళ్ళ అమ్మాయి ఖుషీ షా నిర్ణయమిది. తాను జైన సన్యాసిని కాబోతున్నట్టు ప్రకటించింది. ఆరో తరగతిలో దాదాపు నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకున్న ఈ చిన్నారి గత ఏడాది నవంబరులో స్కూలు మానేసింది. అప్పటినుంచే నిరాడంబర జీవితానికి అలవాటు పడింది. తాను జైన సన్యాసిని కావాలనుకుంటున్నట్టు ఖుషీ షా చెప్పగానే మొదట ఆమె తలిదండ్రులు ఆశ్చర్యపోయినా.. ఆ తరువాత స్వాగతించారు. ఇందుకు తమకెంతో గర్వంగా ఉందన్నారు. శాంతి, మోక్షం సాధించాలంటే సన్యాసి జీవితమే గడపాలని చెబుతున్న ఖుషీ షా.. తన బాల్యం లోనే తన కుటుంబంలో నలుగురు ఈ మార్గాన్ని అనుసరించారని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఈమె తండ్రి వినీత్ షా.. మా కూతురు తన ఏడేళ్ల వయస్సులోనే ఈ నిర్ణయం తీసుకుందని, అయితే అప్పుడు వారించామని చెప్పారు. కానీ.. ఇంత త్వరగా ఆమె ఈ మార్గాన్ని అనుసరించనుందని తాము ఊహించలేదన్నారు. ఆమె ఇదివరకే కాలినడకన వందలాది మైళ్ళు అనేక ప్రాంతాలు పర్యటించి దీక్ష తీసుకున్నవారి అనుభవాల గురించి తెలుసుకుందని ఆయన వెల్లడించాడు. ఖుషీ షా త్వరలో శిరో ముండనం చేయించుకుని దీక్ష తీసుకోనుంది. కాగా-గుజరాత్ లో
ఇలా చిన్న వయస్సులోనే జైన సన్యాసులుగా మారినవారు చాలామంది ఉన్నారు.

Related Tags