కరోనా ఎఫెక్ట్: ఏపీలో మళ్ళీ పెరిగిన పాజిటివ్ కేసులు.. తాజాగా..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఏపీలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. గత 24 గంటల్లో కొత్తగా

కరోనా ఎఫెక్ట్: ఏపీలో మళ్ళీ పెరిగిన పాజిటివ్ కేసులు.. తాజాగా..
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 12:03 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఏపీలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. గత 24 గంటల్లో కొత్తగా 115 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందినవి 82 కాగా.. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 33 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

తాజాగా.. నమోదైన కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,791కి చేరింది. ఇప్పటి వరకూ 64మంది మృతి చెందారు. కొత్తగా 40 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 2,209 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 927 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే.. గత 24 గంటలుగా రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం సంభవించలేదు.

Also Read: కరోనా ట్రెండీ కలెక్షన్.. డిజైనర్ మాస్కులు.. న్యూ ఫ్యాషన్..