మార్స్‌పై మనుగడకు 110 మంది చాలట..!

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో మానవుడు దూసుకుపోతున్నాడు. తన జాతి భూమికి మాత్రమే పరిమితం కాకూడదని తపిస్తున్నాడు. ఇతర గ్రహాలకూ మానవ నాగరికతను వ్యాప్తి చేసేందుకు ముమ్మరంగా

మార్స్‌పై మనుగడకు 110 మంది చాలట..!
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 7:52 PM

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో మానవుడు దూసుకుపోతున్నాడు. తన జాతి భూమికి మాత్రమే పరిమితం కాకూడదని తపిస్తున్నాడు. ఇతర గ్రహాలకూ మానవ నాగరికతను వ్యాప్తి చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా సౌరకుటుంబంలోని మార్స్‌పై మానవ మనుగడను సాధ్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికోసం శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని పోలీటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బోర్‌డియాక్స్‌కు చెందిన ప్రొఫెసర్ జీన్ మార్క్ శాలొట్టి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మార్స్‌పై మానవ నాగరికతను పెంపొందించేందుకు కేవలం 110 మంది మానవులు సరిపోతారని ఆయన తెలిపారు. అంతేకాకుండా వీరంతా ఒకే ఆక్సిజన్ డోమ్(ప్రత్యేకంగా నిర్మించిన గృహం)లో ఉండాలని, వ్యవసాయం, పరిశ్రామలను స్థాపించి నిర్వహించడం ద్వారా జీవనం కొనసాగించవచ్చని ఆయన తెలిపారు.