బ్రేకింగ్ : గణేష్ నిమజ్జనంలో విషాదం.. 11 మంది మృతి

1 Drown After Boat Overturns In Bhopal River During Ganesh Visarjan, బ్రేకింగ్ : గణేష్ నిమజ్జనంలో విషాదం.. 11 మంది మృతి" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/09/boat.jpg 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/boat-300x180.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/boat-768x461.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/boat-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

గణేష్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తా పడి పదకొండు మంది మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఖట్లాపురా ఘాట్‌ వద్ద ఇవాళ ఉదయం ఓ పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే.. ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. పదకొండు మంది మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చేపడుతున్నారు. సామూహిక గణేష్ నిమజ్జన ఉత్సవాల్లోలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు ఆ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. మృతులకు  రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కాగా, ఈ ఘటనపై అదనపు ఎస్పీ అఖిల్‌ పటేల్‌ స్పందించారు. శుక్రవారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పడవలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నట్లు పడవ నిర్వాహకులు చెప్పారని… అయితే స్థానికులు మాత్రం 16 మందికంటే ఎక్కువ ప్రయాణించారని తెలిపారన్నారు. అయితే పదకొండు మంది మృతదేహాలని వెలికితీయగా.. మరో 5 మందిని రక్షించినట్లు తెలిపారు. అయితే స్థానికులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పడంతో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మృతులంతా పిప్లాని ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *