కల్తీ మద్యం కాటుకు 11 మంది బలి

1 died after consuming alcohol in Barabanki, కల్తీ మద్యం కాటుకు 11 మంది బలి" />

ఉత్తరప్రదేశ్‌లో  విషాదం చోటుచేసుకుంది. బారాబంకి జిల్లా రాణిగంజ్ గ్రామంలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరంతా ఒకే దుకాణం నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మంది పోలీసులను సస్పెండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *