సాధువుల హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. దాడిలో వారు ఒక్కరు కూడా లేరట..!

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మహారాష్ట్ర పాల్‌ఘర్‌ మూక దాడిలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏప్రిల్ 16న పాల్‌ఘర్ ప్రాంతంలో దొంగలుగా భావించి ఇద్దరు సాధువులతో పాటు ఓ డ్రైవర్‌ను హతమార్చారు గ్రామస్థులు. సదరు సాధువులు గురువు పరమపదించడంతో.. గురువు అంతిమ సంస్కారాలకు వెళ్తుండగా.. ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ దాడి జరుగుతున్న సమయంలో పలువురు పోలీసులు అక్కడే ఉండికూడా నిర్లక్ష్యం వహించారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో హల్‌చల్‌ అవ్వడంతో మహారాష్ట్ర […]

సాధువుల హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. దాడిలో వారు ఒక్కరు కూడా లేరట..!
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 7:55 PM

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మహారాష్ట్ర పాల్‌ఘర్‌ మూక దాడిలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏప్రిల్ 16న పాల్‌ఘర్ ప్రాంతంలో దొంగలుగా భావించి ఇద్దరు సాధువులతో పాటు ఓ డ్రైవర్‌ను హతమార్చారు గ్రామస్థులు. సదరు సాధువులు గురువు పరమపదించడంతో.. గురువు అంతిమ సంస్కారాలకు వెళ్తుండగా.. ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ దాడి జరుగుతున్న సమయంలో పలువురు పోలీసులు అక్కడే ఉండికూడా నిర్లక్ష్యం వహించారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో హల్‌చల్‌ అవ్వడంతో మహారాష్ట్ర సర్కార్‌ స్పందించింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం యోగీ.. ఉద్ధవ్‌ థాక్రేకు కాల్‌ చేయడంతో.. సాధువులపై జరిగిన దాడిని సీరయస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 110 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 9 మంది మైనర్లుగా గుర్తించి వారిని జువైనల్‌కు తరలించారు. అయితే అరెస్ట్ చేసిన 101 మంది నిందితుల్లో ఒక్కరు కూడా ముస్లింలు లేరని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఉద్దవ్‌ సర్కార్.. నిందితుల జాబితా విడుదల చేసింది. సాధువులపై కావాలనే మూకదాడి జరిగిందని ఆరోపణలు వస్తుండటంతో.. ఈ జాబితాను విడుదల చేసింది.

కాగా.. దొంగలనే పుకార్లు రావడంతోనే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. మరణించిన సాధువులను కల్పవృక్ష గిరి మహరాజ్, సుశీల్ గిరి మహరాజ్‌గా గుర్తించారు. అయితే వీరిపై దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేశారు.