నేను ‘ టెర్రరిస్టునా ‘ ? పదేళ్ల చిన్నారి భావోద్వేగం

అభంశుభం తెలియని చిన్నారులను కూడా బ్రిటన్ వంటి దేశాల్లో ‘ టెర్రరిస్టులు ‘ గా ముద్ర వేయడం, వారి భాష, వారి వస్త్ర ధారణను చూసి శ్వేత జాతీయులు జాతి విద్వేషం వెలిగక్కడం తీవ్ర సంచలనం రేపుతోంది. రేసిజం ఇంతగా ప్రబలిపోతుంటే ఆయా ప్రభుత్వాలు ఇంకా దిక్కులు చూస్తున్నాయి. లండన్లో ఓ పదేళ్ల సిక్కు బ్రిటిష్ గర్ల్ కు ఇటీవల కలిగిన అనుభవమే ఇందుకు తార్కాణం. మున్సిమర్ కౌర్ అనే ఈ బాలిక గత సోమవారం ఆడుకోవడానికి […]

నేను ' టెర్రరిస్టునా ' ? పదేళ్ల చిన్నారి భావోద్వేగం
Follow us

|

Updated on: Aug 11, 2019 | 4:17 PM

అభంశుభం తెలియని చిన్నారులను కూడా బ్రిటన్ వంటి దేశాల్లో ‘ టెర్రరిస్టులు ‘ గా ముద్ర వేయడం, వారి భాష, వారి వస్త్ర ధారణను చూసి శ్వేత జాతీయులు జాతి విద్వేషం వెలిగక్కడం తీవ్ర సంచలనం రేపుతోంది. రేసిజం ఇంతగా ప్రబలిపోతుంటే ఆయా ప్రభుత్వాలు ఇంకా దిక్కులు చూస్తున్నాయి. లండన్లో ఓ పదేళ్ల సిక్కు బ్రిటిష్ గర్ల్ కు ఇటీవల కలిగిన అనుభవమే ఇందుకు తార్కాణం. మున్సిమర్ కౌర్ అనే ఈ బాలిక గత సోమవారం ఆడుకోవడానికి ఓ ప్లే గ్రౌండుకు వెళ్ళినప్పుడు.. నలుగురు పిల్లలు కనిపించారట.. మీరే ఆట ఆడుకుంటున్నారని తాను ప్రశ్నించానని, నన్నూ ఆడనివ్వండి.. ‘ అని కోరగానే వారు.. ‘ వీల్లేదు.. నువ్వు టెర్రరిస్టువి ‘ అని గట్టిగా అరిచారని ఆమె ఓ వీడియోలో తెలిపింది. ఇది తననెంతో బాధించిందని పేర్కొంది. మరుసటిరోజు 9 ఏళ్ళ అమ్మాయి నా స్నేహితురాలైంది. అయితే గంటలోనే ఆమె తల్లి వచ్చి .. తనను ప్రమాదకరమైన వ్యక్తి అని, అందువల్ల ఆడుకోరాదని అంటూ ఆ అమ్మాయిని తీసుకువెళ్లిపోయిందని .మున్సిమర్ కౌర్ వెల్లడించింది. ఇలాంటివారికందరికీ తగినంత జ్ఞానం ఎందుకు లేకపోతోందో తనకు అర్థం కావడంలేదని ఆమె వాపోయింది. సిక్కులు సహజంగా అందర్నీ అభిమానిస్తారు.. రేసిజం గురించి మాట్లాడే పిల్లలు తమ తలిదండ్రులకీ విషయం చెప్పాలి.ఇది తగదని వివరించాలి అని కౌర్ ఈ వీడియో ద్వారా కోరింది. తలపాగా పెట్టుకోవడం నేరమా అని ప్రశ్నిస్తూ.. ఆమె వీడియో సాగింది.. కౌర్ తండ్రి పోస్ట్ చేసిన ఈ వీడియోకు సుమారు 50 .వేల వ్యూస్ వచ్చాయి. గత గురువారం ఇది లైవ్ గా వైరల్ కూడా అయింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..