కేరళలో విషాద సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ సిబ్బంది, క్లాస్ టీచర్ నిర్లక్ష్యంతో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వైనాడ్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సుల్తాన్ బథేరీలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న షెరిన్ అనే బాలిక ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి బలైపోయింది. తరగతి గదిలోని ఓ గోడకు గతంలో ఎప్పుడో ఒక గుంత ఏర్పడింది. ఆ గుంతను ఎవరూ పట్టించుకోకపోవడంతో అది చాలాకాలంగా అలాగే ఉండిపోయింది. దీంతో అందులో విష సర్పాలు, క్రిమికీటకాలు ఆవాసం ఏర్పరచున్నాయి. అది ఎవరూ గమనించకపోవడంతో…షెరిన్ నడుస్తూ పొరపాటున అందులో కాలు పెట్టింది. కాలు గుంతలోకి వెళ్లింది. బయటికి తీయగా, కాలుపై రెండు గాట్లు కనిపించాయి. కొందరు విద్యార్థులు అవి పాము కాట్లు అని చెప్పినా, స్కూల్ సిబ్బంది మాత్రం పెచ్చుల వల్ల గాయాలయ్యాయని భావించారు. దీంతో ఆ బాలికను ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యమైంది. అంతలో షెరిన్ అపస్మారక స్థితిలోకి పడిపోవడం గమనించిన టీచర్లు..హుటాహుటినా ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే షెరిన్ పరిస్థితి విషమంగా మారటంతో కోజికోడ్ కాలేజీకి తరలించారు. అయినా ఫలితం లేకపోవడంతో… చికిత్స పొందుతూ చివరకు షెరిన్ మృతిచెందింది. తమ బిడ్డ మృతికి స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. క్లాస్‌రూమ్‌లో అంతపెద్ద గొయ్యి ఏర్పడినా ఎందుకు పట్టించుకోలేదని సిబ్బంది తీరుపై మండిపడ్డారు.
Breaking News
- దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్కౌంటర్ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్కౌంటర్ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
- కేంద్రీయ సైనిక్ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్.
- ఎన్కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్లో రామ్‌గోపాల్‌వర్మ.
- తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
- గుంటూరు: పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
- ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్లో చంద్రబాబు
- మహబూబ్‌నగర్: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు.