Breaking News
  • ఈఎస్‌ఐ స్కామ్‌పై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది-జయరాం. అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం-జయరాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తాం. అవినీతికి పాల్పడిన వారినెవ్వరినీ వదిలిపెట్టం-మంత్రి జయరాం
  • వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు-ఇంతియాజ్‌ జలీల్‌. అలాంటి వ్యాఖ్యలను పార్టీ సమర్ధించదు. వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. -టీవీ9తో మహారాష్ట్ర ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌.
  • తూ.గో: అన్నవరం ఆలయానికి కొత్త పాలక మండలి నియామకం. 16 మందితో కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో వివాదాస్పదమైన అప్పటి మంత్రి పితాని వ్యవహారం. మందుల సరఫరా బిల్లుల చెల్లింపులో మొదట సరఫరా చేసిన వాళ్లకే.. బిల్లులు చెల్లించాలని ఆదేశించిన అప్పటి కార్మికశాఖ కార్యదర్శి. కార్మికశాఖ కార్యదర్శి ఆదేశాలను అడ్డుకున్న పితాని సత్యానారాయణ. తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చేలా వ్యవహరించారని పితానిపై ఆరోపణలు.
  • ప్రకాశం: ఒంగోలులో ఏఎన్‌ఎం హైమావతి ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన హైమావతి. హైమావతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. విధుల నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించిందన్న స్థానికులు. తనను పర్మినెంట్‌ చేస్తామంటూ అపోలో ఏజెన్సీకి చెందిన.. ప్రదీప్‌, గణేష్‌లు రూ.3 లక్షలు తీసుకున్నారని హైమావతి ఆరోపణలు.

“నిమ్మరసం’ అతి అయితే… ఆరోగ్యానికి తప్పదు దుస్థితి !

Disadvantages of lemon juice, “నిమ్మరసం’ అతి అయితే… ఆరోగ్యానికి తప్పదు దుస్థితి !
నిమ్మకాయ అంటే తెలియని వారుండరు, అది కాస్త పుల్లగా ఉన్నప్పటికీ తినే వాళ్లు కూడా ఉంటారు. నిమ్మకాయతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా నిమ్మరసం లో ఉండే యాసిడ్ ఆమ్లాలు కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తాయి. కానీ, విటమిన్ సి అధికమైన కొన్ని దుష్ప్రభాలు కూడాతప్పవంటున్నారు వైద్య నిపుణులు.
విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కలిగే 10 దుష్ప్రభావాలను ఓసారి పరిశీలిద్దాం…
1 –  స్టొమక్ అప్ సెట్ :
నిమ్మరసంను నేరుగా, ఫ్రెష్ గా తీసుకోవడం వల్ల స్టొమక్ అప్ సెట్ కు కారణమవుతుంది. పొట్టనొప్పి, లూజ్ మోషన్ కు దారితీస్తుంది.
2 – గ్యాస్ట్రో ఈసోఫోల్ రిఫ్లెక్స్ డిసీజ్ :
నిమ్మలో అసిడిక్ కంటెంట్ అధికంగా ఉండి.. హార్ట్ బర్న్, వికారం, వాంతులు, చెస్ట్ పెయిన్, గొంతు నొప్పి వంటి వాటికి దారితీస్తుంది.
3 – పెప్టిక్ అల్సర్ :
నిమ్మరసంను అధికంగా తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లా శాతం పెరిగి అంతర్గత లైనింగ్ ను దెబ్బతియ్యడం వల్ల పెప్టిక్ అల్సర్ పెరుగుతుంది.
4-  గాల్ బ్లాడర్ , కిడ్నీ స్టోన్స్ :
నిమ్మతొక్కలో అధికంగా ఆక్సాలేట్స్ శరీరంలో క్రిస్టల్స్ గా మార్పు చెంది. క్యాల్షియం శోషణకు అంతరాయం కలిగిస్తుంది. క్యాల్షియం బాడీలో శోషణ జరగకపోవడం వల్ల కిడ్నీలో, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ గా ఏర్పడుతాయి .
5- ఐరన్ శోషణ :
నిమ్మరసం, సిట్రిక్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ వీటిని గ్రహించి, ఐరన్ గా మార్చడంలో విఫలం అవుతుంది. క్రమంగా మన శరీరంలో ఉండే ఐరన్ ఉండాల్సినదానికి కంటే ఎక్కువగా ఏర్పడుతుంది. ఇలా ఐరన్ అధికం కావడం వల్ల హీమో క్రొమటోసిస్, లేదా ఐరన్ ఓవర్ లోడ్ వంటి హెల్త్ డిజార్డర్స్ కు గురిచేస్తుంది.
6 – యూరినేషన్ :
నిమ్మరసం యూరినేషన్ను పెంచుతుంది. దాంతో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
7 –  మైగ్రేన్ తలనొప్పి:
నిమ్మరసంలో ఉండే టైరామిన్ అనే అమినో యాసిడ్ బ్రెయిన్ కు సడెన్ గా రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఇది అక్యుట్ మైగ్రేన్ లేదా క్రోనిక్ టెన్షన్, తలనొప్పికి దారితీస్తుంది.
8 – దంత సమస్యలు:
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ లు టీత్ ఎనామిల్ కు హానికలిగిస్తాయి,. ఇది దంతక్షయం, దంతాల రంగు మారడం, డెంటల్ టిష్యులు దెబ్బతినడం, క్యావిటి సమస్య ఏర్పడుతుంది.
9 – సన్ బర్న్ :
అందాన్ని మెరుగుపరుచుకోవడానికి నిమ్మరసంను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే ఆరోగ్యానికైనా..అందానికైనా నిమ్మరసంను మితంగా వాడుకుంటేనే మంచిది. లేదంటే సీరియస్ సన్ బర్న్ కు దారితీస్తుంది. స్కిన్ కంప్లెక్షన్స్ ను దెబ్బతీస్తుంది.
10 – జుట్టు సమస్యలుః
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ నేచుర్ తలలో డ్రైగా మార్చుతుంది.. ఇంటర్నల్ గా జుట్టు కణాలను, జుట్టును వీక్ గా మార్చుతుంది. దాంతో జుట్టు చాలా రఫ్ గా మారి..జుట్టు రాలే సమస్యలు కూడా పెరుగుతాయి.

Related Tags