‘ బాబోయ్..ప్లాస్టిక్ భూతాల దీవి ‘

0 l shoes, 3.7 toothbrushes, ‘ బాబోయ్..ప్లాస్టిక్ భూతాల దీవి ‘" />
పర్యావరణ పరిరక్షణ కోసం, ప్లాస్టిక్ నిషేధం కోసం ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు మొదలవుతుంటే..మరోవైపు దీనికి విరుద్ధంగా ఓ చోట ప్లాస్టిక్  గుట్టలు, గుట్టలుగా దర్శనమిస్తూ పర్యావరణవేత్తలను షాక్ కి గురి చేస్తోంది. ఆస్ట్రేలియాలోని కోకోస్ (కీలింగ్) దీవుల్లో వీటిని రీసెర్చర్లు చూసి కొయ్యబారిపోయారు.  హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ఈ దీవుల్లో సుమారు 10 లక్షల బూట్లు, దాదాపు 4 లక్షల టూత్ బ్రష్ లు, ఇంకా.పలు ప్లాస్టిక్ వస్తువులు కనిపించాయి. ఇవన్నీ  మొత్తం 41.4 కోట్ల వస్తువులని అంచనా వేశారు.  సముద్రపు ఒడ్డు అంతా వీటితో నిండిపోయింది. కేవలం 600 మంది మాత్రమే నివసించే ఈ దీవులను ప్లాస్టిక్ కాలుష్యం కమ్మేయడం విచారకరమని నేచర్ సైంటిఫిక్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది. 238 టన్నుల ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి చేసే చేటు ఇంతాఅంతా కాదని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర జలాల్లో కొట్టుకు వచ్చిన ఇవి సూర్యరశ్మి కారణంగా ముక్కలు ముక్కలుగా మారుతూ పెను ముప్పును కలుగజేస్తున్నాయని వీరు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇప్పటికే 93 శాతం వ్యర్థాలతో నిండిపోయిన ఈ దీవులు భూతలానికి సుమారు 10 సెం.మీ. దిగువకు కుంచించుకుపోయాయని తేలింది. ఒక్క ఆస్ట్రేలియా దీవుల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దీవుల్లోని పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు పర్యావరణవేత్తలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *