అమెరికాలో కాల్పులు, 10 మంది మృతి..!

Chicago Shooting, అమెరికాలో కాల్పులు, 10 మంది మృతి..!

అమెరికాలో గన్ కల్చర్ మళ్లీ జనం ప్రాణాలు తీసింది. షికాగోలో చెలరేగిన హింసలో 10 మంది చనిపోయారు. 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాంగ్‌వార్ ఈ హింసకు కారణమని పోలీసులు తెలిపారు. అల్లర్ల తరువాత ఈ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. వందకు పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీకెండ్‌ సందర్భంగా షికాగోలో గ్యాంగ్ వార్ సర్వసాధారణమైంది. దాడులు, ప్రతిదాడులతో నగరం క్రైం క్యాపిటల్‌గా మారింది. అల్లర్లకు పాల్పడుతున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *