కొబ్బరి పోషకాల గని

కొబ్బరికాయను కొట్టి దేవునిగా ప్రసాదంగా సమర్పించి మనం కూడా తీసుకుంటాం. రకరకాల వంటల్లో వినియోగిస్తూ ఉంటాం. ఐతే ఈ కొబ్బరిలో పోషకాలు అపారంగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.  అందుకే ఆహారంగా కొబ్బరిని సురక్షితంగా ఉపయోగించవచ్చంటున్నారు.  గర్భధారణ సమయంలో కూడా తినడం సురక్షితమంటున్నారు. రెగ్యులర్ డైట్ లో కొబ్బరిని భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు. 1. కొబ్బరిలో కొలెస్ట్రాల్‌ పదార్థాలుండవు. కొబ్బరి తింటే గుండె జబ్బులు వస్తాయన్నది అపోహ. డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం  కొబ్బరిలో ఎన్నో రకాల ప్రోటీన్లు […]

కొబ్బరి పోషకాల గని
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 20, 2019 | 5:50 PM

కొబ్బరికాయను కొట్టి దేవునిగా ప్రసాదంగా సమర్పించి మనం కూడా తీసుకుంటాం. రకరకాల వంటల్లో వినియోగిస్తూ ఉంటాం. ఐతే ఈ కొబ్బరిలో పోషకాలు అపారంగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.  అందుకే ఆహారంగా కొబ్బరిని సురక్షితంగా ఉపయోగించవచ్చంటున్నారు.  గర్భధారణ సమయంలో కూడా తినడం సురక్షితమంటున్నారు. రెగ్యులర్ డైట్ లో కొబ్బరిని భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు.

1. కొబ్బరిలో కొలెస్ట్రాల్‌ పదార్థాలుండవు. కొబ్బరి తింటే గుండె జబ్బులు వస్తాయన్నది అపోహ. డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం  కొబ్బరిలో ఎన్నో రకాల ప్రోటీన్లు మరియు ఎంజైమ్‌లు ఉంటాయి. దాంతో శరీరానికి చాలా ఉపయోగం. కొబ్బరిని నేరుగా కాకున్నా ప్రతి రోజు ఏదైనా ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.

2. కొబ్బరిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది.  ఇది మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను తగ్గించి డయాబెటిస్ ను నియంత్రిస్తుంది.

3. కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది. దీన్లోని పోషకాలు అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది. బరువు తగ్గాలి అనుకొనే వారికి ఇది చాలా మంచిది.

4. కొబ్బరి శరీరంలో నీటిశాతం కోల్పోకుండా చేస్తుంది. శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ ను బయటకు పంపేస్తుంది. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి.

5. విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము కొబ్బరిలో పుష్కలంగా లభిస్తాయి. తరుచుగా కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి.

6. కొబ్బరిలో ఉండే కొవ్వు పదార్థాలు మూర్ఛ మరియు అల్జీమర్స్ వంటి మెదడు రుగ్మతల నుంచి కాపాడుతాయి. కొబ్బరి మేధోశక్తిని పెంచుతుంది.

7. కొబ్బరి మూత్ర విసర్జనలో ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది. ఇది సహజంగా పనిచేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

8. డ్రై కోకనట్ బ్రెయిన్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది. మతిమరుపు వంటి సమస్యలను, ఇతర బ్రెయిన్ డెడ్ సమస్యలను నివారిస్తుంది.

9. కోకనట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

10. మహిళల్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత అనీమియాకు గురి అవుతుంటారు. ఐరన్ లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. డ్రైడ్ కోకనట్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అనీమియాను నివారిస్తుంది.