ఇంగ్లీష్ సులువుగా నేర్చుకోవాలనుకుంటున్నారా..? ఇది మీ కోసమే

Speaking English, ఇంగ్లీష్ సులువుగా నేర్చుకోవాలనుకుంటున్నారా..? ఇది మీ కోసమే

ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ భాష తప్పనిసరి. మాతృభాషలో ఎంత పట్టు ఉన్నప్పటికీ.. పలు రంగాల్లో ఇంగ్లీష్ భాష వచ్చినవారికే మొదటి ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావొచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదవకపోవడం కావచ్చు.. చాలామంది ఆ భాషను నేర్చుకునేందుకు కుస్తీలు పడుతుంటారు. అయితే ఈ భాషను ఇప్పుడు సులువుగా నేర్చుకునేందుకు ఇంగ్లీష్ హెల్పర్ అనే సంస్థ కొత్త కృత్రిమ మేధ సాంకేతికత సాయంతో ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. సాంకేతికత ఆధారంగా విద్యార్థులకు ఆంగ్లం నేర్పేందుకు ఆ సంస్థ ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా ఈ కంపెనీ మహారాష్ట్రలోని 65వేల పాఠశాలల్లో ఆంగ్లం నేర్పేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

దీనిపై సంస్థ సీఈవో సంజయ్ గుప్తా మాట్లాడుతూ.. గ్రేడ్ల వారీగా ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది.. ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్‌లైన్ ద్వారా ఉపయోగించుకునే రూపొందించామని తెలిపారు. మల్టీసెన్సార్ ఏఐ సాఫ్ట్‌వేర్ ద్వారా విద్యార్థుల్లో ఇంగ్లీష్ చదవడం, భాషలో తదితర నైపుణ్యాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. ఇందుకోసం 2015లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ భాగస్వామ్యంతో మహారాష్ట్రలోని 4వేల ప్రభుత్వ పాఠశాలల్లో రైట్ టు రీడ్ కార్యక్రమాన్ని అమలు చేశామన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మరో ప్రాజెక్టును రాష్ట్రంలోని 65వేల పాఠశాలల్లో అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో 15మిలియన్ల మంది విద్యార్థులకు, 2లక్షల మంది ఉపాధ్యాయులు ఇంగ్లీష్ సాధన చేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *