Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

వేటాడి అంతం చేయాలి: బాబా రాందేవ్

, వేటాడి అంతం చేయాలి: బాబా రాందేవ్
  • పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డ బాబా రాందేవ్
  • ఆ దేశంతో సత్సంబంధాలు ఎప్పటికీ సాధ్యం కావు

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి ఘటనపై యోగా గురు బాబా రాందేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. పరిణితిలేని దేశంగా వ్యవహరిస్తోన్న పాక్‌కు భారత ప్రధాని మోడీ తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మాటలు ఎన్ని చెప్పినా ఫలితం ఉండదని, చేతలు ఉండాలని ఆయన అన్నారు.

పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అయిన మసూద్ అజహర్‌ను ఎక్కడున్న భారత్‌కు తీసుకురావాలి. లేదంటే ఒసామా బిన్ లాడెన్‌కు పట్టిన గతే పట్టాలని అన్నారు. 2008లో ముంబైలో ఉగ్రదాడుల సూత్రదారి సయ్యద్ హఫీజ్‌ను కూడా పట్టుకుని భారత్‌కు తీసుకురావాలన్నారు బాబా రాందేవ్.

ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి. పాకిస్థాన్‌తో సత్సంబాధాలు ఎప్పటికీ సాధ్యం కావు, ఎందుకంటే పాక్ ఆ సత్సంబంధాలను కోరుకోవడంలేదని బాబా రాందేవ్ అన్నారు. జమ్మూ కశ్మీర్‌‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40కిపైగా సీఆర్పిఎఫ్ జవాన్లు కన్నుమూసిన సంగతి తెలిసిందే.