Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

వీర జవానుకి కన్నీటి వీడ్కోలు..

, వీర జవానుకి కన్నీటి వీడ్కోలు..

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన వీర జవాన్ల పార్ధీవ దేహాలు ఒక్కొక్కటిగా స్వగ్రామాలకు చేరాయి. శనివారం ఉదయం 7 నుంచి కుటుంబ సభ్యులకు పార్ధీవ దేహాలను ఆర్మీ అందించింది. అయితే ఈ సందర్భంగా ఆయా ఊళ్లలో జనాలు తండోపతండాలుగా వచ్చి వీర జవాన్లను కడసారి దర్శించుకున్నారు. రోడ్లపై పువ్వులు, జాతీయ జెండాలతో నివాళులర్పించారు.

, వీర జవానుకి కన్నీటి వీడ్కోలు..

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో ప్రాంతవాసి అయిన 35 ఏళ్ల అజిత్ కుమార్ ఆజాద్ దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అజిత్ కుమార్ అంటే స్థానికులందరికీ తెలుసు దీంతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనంతరం గంగా ఘాట్ వద్ద అంత్యక్రియలు జరిగాయి. వారణాసిలో కూడా ఇదే తరహాలో జరిగింది. రమేశ్ యాదవ్‌కు స్థానికులు భారీ సంఖ్యలో వచ్చి నివాళులర్పించారు.

, వీర జవానుకి కన్నీటి వీడ్కోలు..

జైపూర్‌కు చెందిన రోహిత్‌షా లాంబాను చూసేందుకు నగర ప్రజలంతా వచ్చారు. ఆయన కుటుంబంతో పాటు శోకాన్ని పంచుకున్నారు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో హైవేపై విధులు నిర్వహిస్తోన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ మోహన్‌లాల్‌ కూడా అశువులు బాసారు. ఆయనకు డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ నివాళులర్పించారు.

, వీర జవానుకి కన్నీటి వీడ్కోలు..

బీహార్, అస్సాం, ఒడిశా, తమిళనాడు.. ఇలా దేశ వ్యాప్తంగా జవాన్ల పార్ధీవ దేహాలను ఆర్మీ వారి కుటుంబ సభ్యులకు అందించింది. స్థానికులు వారికి కడసారి దర్శించుకుని నివాళులర్పించారు.

ఘటన తర్వాత శుక్రవారం ప్రధాని మోడీ మాట్లాడుతూ సీఆర్పిఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి చేసి చాలా పెద్ద మిస్టేక్ చేశారని, అందుకు భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ సందర్భంలోనే భద్రతా దళాలకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇస్తున్నట్టు కూడా ప్రధాని ప్రకటించారు.

, వీర జవానుకి కన్నీటి వీడ్కోలు..