రేపు మంత్రి కేటీఆర్ నల్గొండ పర్యటన

Minister Ktr will start distribution Bathukamma sarees in Nalgonda, రేపు మంత్రి కేటీఆర్ నల్గొండ పర్యటన

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేపు (సోమవారం) నల్గొండలో పర్యటించనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీని కేటీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగకు సర్వం సిద్ధం చేస్తున్న దృష్ట్యా దసరా పండుగ రోజున తెలంగాణ ఆడపడుచులంతా కొత్త చీరలు ధరించాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం బతుకమ్మ చీరెలను పంపిణీ చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రేపు పర్యటిస్తున్నందున ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.

గత ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొంతకాలం ఆ చీరల్ని పంపిణీకి ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పంపిణీ చేశారు. ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత రెండో సారి బతుకమ్మ చీర పంపిణీ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *