Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

రఫెల్ తో మనం మరింత పటిష్టమవుతాం: ఎయిర్‌ఫోర్స్‌ వైస్‌ చీఫ్‌

, రఫెల్ తో మనం మరింత పటిష్టమవుతాం: ఎయిర్‌ఫోర్స్‌ వైస్‌ చీఫ్‌

దిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల రాకతో మన వైమానిక దళ సామర్థ్యం పెరగుతుందని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వైస్‌ చీఫ్‌ అనిల్‌ ఖోస్ల అన్నారు. రఫేల్‌పై రాజకీయ రగడ జరుగుతోన్న నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా స్పందించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు నాటికి తొలి రఫేల్‌ యుద్ధ విమానం భారత్‌కు రానున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లో డెలివరీ చేయగా.. దాన్ని భారత్‌కు తీసుకురానున్నట్లు వెల్లడించారు. గతేడాది నవంబరులో రఫేల్‌ ఫస్ట్‌లుక్‌ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌లో రఫేల్‌ తొలి యుద్ధ విమానానికి పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబరు నాటికి రఫేల్‌ తొలి విమానం భారత్‌కు రానున్నట్లు గత నెల కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే. మిగిలిన విమానాలు 2022లోపు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.

ప్రతిపక్షానిది అనవసర రాద్ధాంతం: భాజపా

, రఫెల్ తో మనం మరింత పటిష్టమవుతాం: ఎయిర్‌ఫోర్స్‌ వైస్‌ చీఫ్‌

 

‘విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలన్నీ బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి. ఆయన ప్రధానిని దేశద్రోహి అన్నారు. అతని దగ్గర నుంచి ఇటువంటి వ్యాఖ్యలకు మించి ఏమీ ఆశించలేం. విమాన తయారీ కంపెనీలకు రాహుల్‌ లాబీయిస్ట్‌గా పని చేస్తున్నారు. ఎయిర్‌బస్‌కు సంబంధించిన ఈమెయిల్స్‌ ఆయన వద్దకు ఎలా వచ్చాయ్‌? నిజాయతీగల ప్రధానమంత్రిని అవమానిస్తూ రాహుల్‌ తనపై తానే బురద చల్లుకుంటున్నారు. ఆయన ఆడుతున్న అబద్ధాలను ప్రజల ముందు బయటపెడతాం’ అని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ అనిల్‌ అంబానీకి ప్రధాని మోదీ మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపించిన విషయం తెలిసిందే.