Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

రెండో కుమార్తె రెండో పెళ్లి

, రెండో కుమార్తె రెండో పెళ్లి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రెండో కూతురు సౌందర్య వివాహం సోమవారం చెన్నైలో ఘనంగా  జరిగింది. ఎంఆర్సీ నగర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ హోటల్‌లో సౌందర్య, తమిళ నటుడు విషగన్ వనగమూడి వివాహం జరిగింది. పెళ్లి కూతురి గెటప్ లో సౌందర్య మెరిసిపోయారు.  ఈ పెళ్లికి తమిళనాడు సీఎం పళనిస్వామి, నటులు కమల్ హాసన్, మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న, సుబ్బిరామి రెడ్డి, అనిరుధ్, ధనుష్,  ప్రభు, రాఘవ లారెన్స్ తదితరుల ప్రముఖులు హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం రిసప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు. 

, రెండో కుమార్తె రెండో పెళ్లి